అక్షరటుడే, బాల్కొండ: జిల్లాలో మరో సహకార సొసైటీ హస్తగతం కానుంది. బాల్కొండ నియోజకవర్గంలోని ముచ్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్లు 9 మంది బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జి సునీల్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో బంగ్లా దేవేందర్, బంగ్లా లక్ష్మీనరసింహ గౌడ్, బురెడ్డి గంగారెడ్డి, బురెడ్డి చిన్న రాజన్న, ఈదపు శ్రీనివాస్, కైరి లక్ష్మి, తెడ్డి లావణ్య, బొమ్మెన సాయన్న, వడ్యాల లక్ష్మణ్ ఉన్నారు. సొసైటీలో 12 మంది డైరెక్టర్లు ఉండగా.. 9 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి, నర్సయ్య, సంతోష్, లింబాద్రి, కొరాడి రాజు, రాజేష్, నరేందర్ నేనావత్ పాల్గొన్నారు.
జిల్లాలో మరో సొసైటీ హస్తగతం
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement