అక్షరటుడే, వెబ్ డెస్క్: ఉమ్మడి జిల్లాపై మళ్లీ చలి పంజా విసురుతోంది. దాదాపు 30 ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. చరిత్రలో మునుపెన్నడూ చూడనంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదయ్యాయి. అత్యల్పంగా జుక్కల్ లో 7.6, కోటగిరిలో 7.7, గూపన్ పల్లిలో 8.3, పోతంగల్, మెండోరాలో 8.7, మద్నూర్ లో 8.9, సాలూరా, బీర్కూర్, బిచ్కుందలో 9.2, పాల్దాలో 9.3, నస్రుల్లాబాద్, మాక్లూర్ లో 9.5, సిరికొండ, నందిపేట్ లో 9.6, నిజామాబాద్ సౌత్, పెర్కిట్, ఎడపల్లి, పాల్వంచ, గాంధారిలో 9.7, చందూర్, పిట్లంలో 9.8, మంచిప్ప, సర్వాపూర్ లో 9.9, ఆర్మూర్, మోర్తాడ్, బాల్కొండ, దోమకొండ, నాగిరెడ్డిపేటలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్నిలోని జాకోరా, కామారెడ్డిలోని ఐడీవోసీ మినహా మిగతా ప్రాంతాల్లో 10-15 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.