అక్షర టుడే, కామారెడ్డి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల విక్రయించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, సమగ్ర సర్వేపై అధికారులతో సమీక్షించారు. సేకరించిన ధాన్యం వెనువెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని ఆదేశించారు. సమగ్ర సర్వే డేటాను సైతం తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి డేటా ఎంట్రీకి అవసరమైన ఆపరేటర్లను నియమించుకోవాలని చెప్పారు.