అక్షరటుడే, జుక్కల్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద ఎకో టూరిజం కోసం 121 సర్వే నంబర్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. శనివారం ఈ స్థలాన్ని టూరిజం అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజు, కన్సల్టెంట్‌ హరిలతో కలిసి కలెక్టర్‌ పరిశీలించి, తహసీల్దార్‌ భిక్షపతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ భూమికి సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.