అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వ వసతి గృహాలను మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలను సందర్శించి వసతిగృహాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందేలా చూడాలని పేర్కొన్నారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాసరావు, ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Prajavani | ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం