అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వేలో దరఖాస్తుదారుల వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. గురువారం గూడెం గ్రామంలో సర్వేను పరిశీలించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పూర్తి వివరాలను సేకరించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. భూమి పత్రాలు, రేషన్‌కార్డు, ఇంటి యజమానురాలి ఫొటోలను సేకరించి యాప్‌లో పొందుపర్చాలని చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో రంగనాథ్‌ రావు, తహసీల్దార్‌ జనార్దన్ ఉన్నారు.