అక్షరటుడే, కామారెడ్డి: జనవరి 31లోగా బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం తన ఛాంబర్లో బ్యాంకర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.250 కోట్ల రుణాల పంపిణీ టార్గెట్ ఉందని, లక్ష్యానికి అనుగుణంగా అందించాలని తెలిపారు. అదేవిధంగా రికవరీ వంద శాతం చేయాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.