అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ఇంటర్మీడియెట్ లో డ్రాపవుట్ అయిన విద్యార్థులను గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కళాశాలల్లో ఉదయం మెడిటేషన్, యోగా వంటి కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో డీఐఈవో షేక్ సలాం, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి దయానంద్, డీఎంహెచ్ వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.