అక్షరటుడే, కామారెడ్డి: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సదాశివనగర్ మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కుప్రియాల్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడ సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ తీరును పరిశీలించారు. తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేపట్టాలని ఆదేశించారు.