అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, డీఆర్డీవో సాయగౌడ్, డీపీవో చక్రవర్తుల తరుణ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అర్జీలు సమర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వినతులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.