అక్షరటుడే, ఇందూరు: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.