అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఇన్ ఛార్జి డీపీవో శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు.

Advertisement
Advertisement
Advertisement