అక్షరటుడే, ఆర్మూర్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఆర్మూర్‌ నియోజకవర్గంలో చేపట్టిన సర్వేను గురువారం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. ఆర్మూర్‌ పట్టణంలోని 20వ వార్డులో, ఇస్సాపల్లి, పెర్కిట్‌లో ఆయన సర్వే తీరును పర్యవేక్షించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి సర్వే అధికారులు తెలుసుకుంటున్న వివరాలను అడిగారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, తహశీల్దార్‌ గజానంద్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ తదితరులున్నారు.