అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: సంక్షేమ పథకాల అమలు నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలోని లోలంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈనెల 26వ తేదీ నుంచి అర్హులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైన దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, మండల ప్రత్యేకాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.