అక్షరటుడే, ఇందూరు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎడపల్లి పీహెచ్సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రోజువారి రోగుల సంఖ్య, చికిత్స తదితర అంశాలను ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఏఎన్సీ పరీక్షలు చేయాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.