అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు చేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించారు. బియ్యం నిల్వలు, సరుకులను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
Advertisement
Advertisement