అక్షరటుడే, ఇందూరు: విపత్తులు సంభవించిన సమయాల్లో ఆపదమిత్రలు తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. కలెక్టరేట్​లోని విపత్తుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం కమ్యూనిటీ వలంటీర్లకు ‘ఆపదమిత్ర’ పేరుతో శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి పరంగా లేదా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో ఆపద మిత్రలు తక్షణమే స్పందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, కలెక్టరేట్ విపత్తుల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.