అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.