అక్షరటుడే, ఇందూరు: జిల్లా కేంద్రంలోని వినాయక నగర్​లో గల ఈవీఎం గోదాంను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా గోడౌన్​ను తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అందుబాటులో ఉన్న బ్యాలెట్ బాక్స్​ల గురించి ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగరావు తదితరులు ఉన్నారు.