అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఇందల్వాయి ఏకలవ్య గురుకులంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. క్యాటరింగ్ అసిస్టెంట్(1), మెస్ హెల్పర్(2), శానిటేషన్(1)(ఉమెన్), ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ (1) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేటరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మెస్ హెల్పర్, శానిటేషన్ పోస్టులకు టెన్త్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టుకు టెన్త్‌తో పాటు ఐటీఐ లేదా పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఈ నెల 12లోపు దరఖాస్తులను గురుకులంలో సమర్పించాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఇందల్వాయి ప్రిన్సిపాల్ 83979 47334 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.