అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నగరంలోని ఇంద్రాపూర్‌లో విస్తరాకుల ఫ్యాక్టరీ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని కాలనీవాసులు కార్పొరేషన్‌ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. ఫ్యాక్టరీ కారణంగా కాలనీలో కలుషిత వాతావరణం ఏర్పడుతోందన్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్‌ శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహిపాల్‌ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. 20రోజుల్లోగా ఖాళీ చేయాలని ఫ్యాక్టరీ యజమానులకు సూచించారు.