అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి, నిజామాబాద్ మాజీ గ్రంథాలయ ఛైర్మన్​ మార చంద్రమోహన్, ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్​ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్​ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్​ షేక్ మున్నాభాయ్, లింగాగౌడ్, మార్కెట్ యార్డ్ వైస్​ఛైర్మన్​ ఇస్సపల్లి జీవన్, ఆర్మూర్ నియోజకవర్గ మండల అధ్యక్షుడు విజయ్, మహిపాల్, రవి, భూమేశ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.