అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వయనాడ్‌ లోకసభ స్థానం నుంచి బుధవారం నామినేషన్‌ వేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు వెంటరాగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆమె నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ప్రియంకగాంధీ మాట్లాడుతూ ‘వయనాడ్‌ విపత్తులో కుటుంబాలను కోల్పోయిన పిల్లల్ని చూశాను. పిల్లల్ని కోల్పోయిన తల్లుల్ని చూశాను. సర్వస్వం కోల్పోయిన కుటుంబాలతో మాట్లాడాను. ఇంత కష్టంలోను ఒకరికొకరు సహకరించుకున్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య నేను భాగం కావడం గొప్పగౌరవం’ అని అన్నారు. కేరళలోని పాలక్కాడ్‌, చెలక్కర అసెంబ్లీ స్థానాలతో పాటు వయనాడ్‌ లోకసభ ఉప ఎన్నిక నవంబర్‌ 13న జరగనుంది. నవంబర్‌ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.