అక్షరటుడే, వెబ్‌డెస్క్: భైంసా పట్టణంలోని కమల జిన్నింగ్ ఫ్యాక్టరీలో సోమవారం నిర్వహించనున్న ప్రజాపాలన సంబరాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా మైనార్టీ సెల్ ఇన్‌ఛార్జి ఎంఏ లతీఫ్ పేర్కొన్నారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో సంబురాలు జరుగుతాయన్నారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.