అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వయనాడ్‌ లోక్ సభ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్ పెట్టారు. ‘‘నా గెలుపు మీ విజయం. పార్లమెంట్‌లో మీ గొంతుక అవుతాను.. ప్రచారంలో పని చేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారు. నాతల్లి, భర్త, పిల్లలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నా వెనుక ఉండి నడిపించినందుకు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు ’’ అని ప్రియాంక ట్వీట్‌ చేశారు. వయనాడ్‌లో ప్రస్తుతం ప్రియాంకగాంధీకి 4,10,931 మెజారిటీ వచ్చింది.

25న ప్రియాంక ప్రమాణస్వీకారం..!

శీతకాల పార్లమెంట్‌ సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో సోమవారమే ప్రియాంక ఎంపీగా లోకసభలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లో సోనియా, రాహుల్‌, ప్రియాంక ముగ్గురు సభ్యులు ఉండడం విశేషం.