అక్షరటుడే, ఆర్మూర్: పట్టణానికి చెందిన చిన్న భోజన్న అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో చికిత్స నిమిత్తం రూ. 45వేల ఎల్‌వోసీని గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్ రాము, పండిత్ పవన్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.