అక్షరటుడే, ఎల్లారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే విధంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని పార్టీ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి రఫీయుద్దీన్ సూచించారు. లింగంపేట మండలంలోని భవానిపేట్, ఎక్కపల్లి తండాలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయిలు, ఏదుల్, అట్టెం శ్రీను, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.