అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల ఎస్ డీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశ వేణు తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టుల నిర్మాణం కోసం రూ.6.25 కోట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతులు, వసతుల కల్పనకు రూ.1.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే నగరంలో తాగునీటి వ్యవస్థ కోసం మిగిలిన నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు, నిజామాబాద్ నగర ఇన్ చార్జి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.