అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను విస్మరిస్తుందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలను వంచించిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా బీసీలు వెనుకబడ్డారన్నారు. ఎంతమంది బీసీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలిచ్చారో కవిత సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రీతం, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.