అక్షరటుడే, ఆర్మూర్: నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి వినయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నిధుల మంజూరు విషయమై మంత్రి సీతక్కను కోరగా స్పందించి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మంథని– రాంపూర్ రోడ్డుకు రూ.4.40 లక్షలు, మాక్లూర్ మండలంలో గొట్టిముక్కుల మీదుగా ఆంధ్రనగర్, లక్నాపూర్, ఇంద్రానగర్ వరకు రూ.2.03 లక్షలు, నందిపేట్ నుంచి ఎల్లమ్మ దేవాలయం వరకు రూ.2లక్షలు, ఇతర బీటీ రోడ్లకు రూ.19.87 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. ఈ మేరకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.