అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్రా నారా గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోల్కంపేటలో రూ. 5 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లమయ్య, నాగరాజు, గ్రామ అధ్యక్షుడు అజయ్, డిష్ అశోక్, నగేష్, కృష్ణమూర్తి, మోహన్ గౌడ్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.