అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలో ఓ కానిస్టేబుల్ కొడుకు హల్చల్ చేశాడు. ఒకటో టౌన్లో శుక్రవారం రాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. కాగా.. అతడిపై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. శుక్రవారం రాత్రి కోర్టు సమీపంలో కానిస్టేబుల్ కు, పలువురు యువకులకు మధ్య గొడవ జరిగింది. అనంతరం ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఇరువర్గాల వారిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సమయంలో సదరు కానిస్టేబుల్ కుమారుడు పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయాడు. నానా హంగామా చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. అలాంటిదేమీ లేదని దాటవేశారు.