అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. 75వ రాజ్యంగ దినోత్సవం సందర్భంగా హమారా సంవిధాన్ – హమారా స్వాభిమాన్ పేరుతో వేడుకలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. వేడుకల జ్ఞాపకార్థం నాణెం, పోస్టల్ స్టాంప్‌లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.