అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలోనే పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ప్రక్రియ ఆలస్యం అయింది. తాజాగా టెండర్లు పిలవడానికి ఈసీ అనుమతిచ్చింది. కాగా సుమారు రూ.42 వేల కోట్ల విలువైన 62 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు.