అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని జానకంపల్లి కుర్దులో శనివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.5లక్షల ఉపాధిహామీ నిధులతో పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావుకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సామెల్, బొండ సాయిలు, షెకావత్, సంతోష్ నాయక్ పాల్గొన్నారు.