అక్షరటుడే, ఇందూరు: నగరంలో వీధి కుక్కలను ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పట్టుకోవాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కుక్కలకు కు.ని. ఆపరేషన్లు చేసే యూనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వీధికుక్కలతో నగరవాసులకు ఇబ్బందులు కగలకుండా చూడాలన్నారు. కమిషనర్‌ వెంట మేనేజర్‌ జనార్ధన్‌, సోల్మన్‌రాజు, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.