అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి : డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులపై మంగళవారం నిజామాబాద్, కామారెడ్డిలలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు డీఈవోలు దుర్గాప్రసాద్, రాజు తెలిపారు. తదుపరి కౌన్సిలింగ్ షెడ్యూల్ సమాచారం జిల్లా డీఈవోల వెబ్సైట్లలో పొందుపరుస్తామని తెలిపారు.