అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఈనెల 21 నుంచి పోలీస్ సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీపీ కల్మేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలు అర్పించారన్నారు. వారిని స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారోత్సవాల సందర్భంగా అమరవీరుల దినోత్సవం, క్యాండిల్ ర్యాలీ, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.