అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిబంధనలకు లోబడి సౌండ్ స్టిస్టంను ఏర్పాటు చేసుకోవచ్చని సీపీ కల్మేశ్వర్ పేర్కొన్నారు. డీజేల నిర్వాహకులు ఈ నెల 30వ తేదీలోగా లైసెన్సులు, పర్మిషన్లు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఆదివారం నగరంలోని డీజేల నిర్వాహకులు సీపీని కలిసి సౌండ్ సిస్టంలను నిషేధించవద్దని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సౌండ్ సిస్టంను ఉపయోగించుకోవచ్చని సూచించారు. అయితే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పర్మిషన్ లేకుండా డీజేలు ఏర్పాటు చేయడాన్ని నిషేధించామన్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.