అక్షరటుడే, వెబ్​డెస్క్​: అక్రమ వలసదారులపై ట్రంప్​ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వలసదారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఆదివారం అమెరికా పార్లమెంటు ముందు మాట్లాడిన వీడియోను ఆయన విడుదల చేశారు. వారిని పంపించే ముందు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. జంతువులను వేటాడినట్లు వారిని వెంటపడి పట్టుకొని పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.