అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2,500 ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ జరగలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, సభ్యులు భువనేశ్వర్, కుల్దీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.