అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌ సవరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పెద్ది వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ రాష్ట్రానికే ఎక్కువ నిధులు కేటాయించారని, తెలంగాణకు మొండిచేయి చూపారన్నారు. జిల్లాలో బోధన్‌–బీదర్, ఆర్మూర్‌–ఆదిలాబాద్‌ రైల్వేలైను ప్రస్తావనే లేదని, పట్టణ ప్రాంతాలకు ఉపాధిహామీ పథకం వర్తింపుపై శ్రద్ధ పెట్టలేదని పేర్కొన్నారు. బడ్జెట్‌ ను పునఃపరిశీలించి తెలంగాణకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, సురేష్, నాయకులు నర్సయ్య, సుజాత, అనసూయమ్మ, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.