అక్షర టుడే, కామారెడ్డి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో అన్యాయం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి అన్నారు. శనివారం పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించిన జిల్లా మహాసభలో మాట్లాడారు. జమిలి ఎన్నికల నిర్వహణ రాష్ట్రాల హక్కులను హరించడమేనన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించే పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.