అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి మొదటి వారంలో తెలంగాణ గోల్డ్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో అసోసియేషన్ జిల్లా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లుగా టీసీఏ ఆధ్వర్యంలో బీసీసీఐ గుర్తింపు కోసం “రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ వికెట్” పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్ మినిస్టర్ కప్, తెలంగాణ గోల్డ్ కప్, ఆల్ స్టార్ క్రికెట్ కప్, ఫ్రీడమ్ కప్ టోర్నీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో ఈసారి తెలంగాణ గోల్డ్ కప్ పేరుతో క్రికెట్ సంబరాలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా నమోదు చేసుకున్న 32 జట్లకు మాత్రమే అవకాశం ఉందని, యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. విజేతలకు రూ.50వేలు, రన్నరప్ కు రూ.25 వేల నగదు బహుమతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు నయీమ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.