అక్షరటుడే, ఎల్లారెడ్డి: మున్సిపల్ మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్లారెడ్డి మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల జట్లు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి బహుమతి రూ. 51వేలు, రెండో బహుమతి రూ. 21వేలు, మూడో బహుమతి రూ 11వేలు ఉంటుందన్నారు. క్రీడాకారులకు మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశామన్నారు.