అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టు అయ్యర్‌ని రూ. 26.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న అతడి కోసం మొదటగా కోల్‌కతా, ఢిల్లీ జట్లు పోటీపడ్డాయి. చివరకు పంజాబ్‌జట్టు వేలంలో అధిక ధరను ప్రకటించి అతడిని కైవసం చేసుకుంది.