అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: దేశానికి అంబేద్కర్ సేవలు మరువలేనివని దళిత కళ్యాణ్ సమితి అధ్యక్షురాలు పింకీ అన్నారు. నగరంలోని 51వ డివిజన్ గాజులపేట్ లో శుక్రవారం రాత్రి సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి రాందాస్, కోశాధికారి గుణసాగర్, వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర కుమార్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ సర్దార్ నరేంద్ర సింగ్, మాజీ కార్పొరేటర్ రామడుగు బాలకిషన్, దేశాయి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.