అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలం నెమ్లీ సాయిబాబా ఆలయంలో ఆదివారం ఘనంగా దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. పురోహితులు అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నిజాంసాగర్ మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో భక్తుల పూజలు