అక్షరటుడే, కామారెడ్డి: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించలేదని.. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాచౌక్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా వాళ్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, షేరు, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.