అక్షరటుడే, కామారెడ్డి: ఏడాది పాలనపై రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు కాదని, అపజయోత్సవాలు నిర్వహించుకోవాలని దీక్ష దివస్ జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన కామారెడ్డి శివారులో దీక్ష దివస్ కార్యక్రమ నిర్వహణపై నాయకులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు విషపూరిత ఆహారాన్ని పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే నాయకులు పాల్గొన్నారు.